మాట నిలబెట్టుకున్న NTR
మాట నిలబెట్టుకున్న NTR

బిగ్ బాస్ సీజన్ 1 చూసినోళ్ళందరికీ ఈ విషయం గుర్తుండే వుంటుంది. శివబాలాజీ, ఆదర్స్ మధ్య పోటీలో శివబాలాజీ బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా నిలిచిన సందర్భంలో NTR ఆదర్శ్ ని ఓదారుస్తూ వచ్చే సినిమాలో కలిసి నటించే అవకాశం కల్పిస్తానానని చెప్పారు. చెప్పటమే కాకుండా దాన్ని నిరూపించుకున్నారు కూడా. ఎలా అంటే

NTR-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆదర్శ్‌ ఒక పాత్రలో కన్పించనున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన ఆనందాన్ని ప్రకటించారు ఆదర్శ్. ‘ఆదివారం నాకు ఎంతో ప్రత్యేకంగా గడిచింది. అతిథి పాత్రే అయినప్పటికీ తారక్‌, తివిక్రమ్‌తో కలిసి పనిచేయడం కల నెరవేరినట్లుగా ఉంది.’ అని పోస్ట్ చేసారు.

Posted On 6th August 2018