కరుణానిధి కన్నుమూత
కరుణానిధి కన్నుమూత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఈరోజు సాయంత్రం 6.10గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశారు.

కరుణానిధి మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Posted On 7th August 2018