YS జగన్ అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన సతీమణి YS భారతిపై అభియోగాలు నమోదయ్యాయి. భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ED ( ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ) CBI కోర్టులో ఈమధ్యే చార్జిషీటు దాఖలు చేసింది.
భారతీ సిమెంట్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటివరకూ CBI 3 చార్జిషీట్లు (CC 14/2012, CC 24/2013, CC 25/2013) దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లులో భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తారని గతంలోనే వార్తలు వచ్చాయి కానీ CBI ఆ పనిచేయలేదు. CBI నుండి తప్పించుకున్నా ED నుంచి భారతి తప్పించుకోలేకపోయారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ చార్జిషీట్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరిస్తే నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. CBI దాఖలు చేసిన 11 చార్జిషీట్లపై విచారణలో భాగంగా జగన్ ప్రతి శుక్రవారం CBI ప్రత్యేక కోర్టు ముందు హాజరవుతున్న విషయం అందరికీ తెలిసిందే. భారతి సిమెంట్స్‌లో మనీలాండరింగ్‌పై ED దాఖలు చేసిన ఫిర్యాదును కూడా కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీచేస్తే YSజగన్, YS భారతి ఇద్దరూ న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి ఉంటుంది.
Posted On 10th August 2018