BJP కూటమికి... TRS మద్దతు
BJP కూటమికి... TRS మద్దతు

అవసరం వచ్చినప్పుడల్లా మోడీకి, BJP కి మద్దతు ప్రకటించే KCR మరోసారి, NDA కూటమి కి స్నేహహస్తాన్ని అందించారు. రాజ్యసభ ఎన్నికల్లో NDA అభ్యర్ది హరివంశ్ నారాయణ్ సింగ్ కు TRS సభ్యులు ఓటు వేసారు.

ఈ ఎన్నికల్లో NDA అభ్యర్ది విజయం సాధించారు. NDA అభ్యర్ది హరివంశ్ నారాయణ్ సింగ్ 125 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ది BK హరిప్రసాద్ కు 105 ఓట్లు మాత్రమే వచ్చాయి.

TRS, అన్నాడీఎంకే వల్లే NDA విజయం

రాజ్యసభలో ఎన్డీయే బలం 95 మాత్రమే. టీఆర్‌ఎ్‌సకు చెందిన ఆరుగురు, అన్నాడీఎంకే సభ్యులు 13 మంది, బిజూ జనతాదళ్‌ ఎంపీలు 9 మంది సమాజ్‌వాదిపార్టీ బహిష్కృత నేత అమర్‌సింగ్‌, మరో స్వతంత్ర సభ్యుడు హరివంశ్‌కు ఓటు వేశారు. వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇక్కడ 30 ఓట్లు కలిసి వచ్చాయి. దీంతో NDA అభ్యర్ది విజయం సాధించారు.

హైదరాబాద్ లో మోడీని, BJP ని విమర్శించే TRS నాయకులు, ఢిల్లీ లో NDA కు మద్దతు ఇవ్వడం పలు విమర్శలు వస్తున్నాయి. ఇలా చేయడం మొదటిసారి కాదు, చాలా సార్లు ఇలా జరగడంతో TRS కూడా NDA లో కలిసిపాయిందా అని అనుమానం వస్తోంది.

TRS పార్టీ BJP కి మద్దతుగా నిలిచిన సందర్భాలు

  • రాష్ట్రపతి ఎన్నికల్లో
  • ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో
  • అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చిన సమయంలో ( చర్చకు రాకుండా AIDMK తో కలిసి సభలో గందరగోళం )
  • అవిశ్వాస పరీక్షలో ( ఓటింగ్ కు దూరంగా ఉండడం )
  • రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో

ఇక్కడ BJPని విమర్శించడం, అక్కడ కౌగిలించుకోవడం సమంజసమేనా. ఎంతకాలం ఇలా మోసం చేస్తారు, ప్రజలు అన్నీ చూస్తూనే ఉన్నారు.

మోడీకి KCR తొత్తులా వ్యవహరిస్తున్నారు - CPI రామకృష్ణ

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకూ ఇవ్వాల్సిందే

జోగిని శ్యామల కంటతడి, KCR ప్రభుత్వంపై శాపనార్ధాలు

నిర్ణయాల స్వేచ్ఛను రాష్ట్రాలకే వదిలేయండి

Posted On 10th August 2018