జెండా రంగుల్లో ప్రకాశం బ్యారేజి

స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రకాశం బ్యారేజిపై అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. త్రివర్ణ పతాక రంగులతో ప్రకాశం బ్యారేజి సొగసులీనింది. బ్యారేజి గేట్లపై ఏర్పాటు చేసిన ఈ లైటింగ్ నీటిలోకి కూడా ప్రతిబింబించటంతో కృష్ణా నదీ ఆనకట్ట ధగధగలాడింది. ఇది చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు బ్యారేజీకి తరలిరావటంతో ఆనకట్ట రహదారి పూర్తిగా జనంతో కిక్కిరిసింది. దీనికి తోడు నిండుకుండలా మారిన ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్ నుంచి దిగువకు 17 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు, సెల్ఫీలు తీసుకుని ముచ్చట పడ్డారు.

Posted On 15th August 2018