తెలంగాణ అంటే నాకు పిచ్చి ప్రేమ
తెలంగాణ అంటే నాకు పిచ్చి ప్రేమ

తెలంగాణ ప్రాంతమన్నా, తెలంగాణ ప్రజలన్నా తనకు ఎంతో ప్రేమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

‘‘తెలంగాణలో పార్టీని దశలవారీగా బలోపేతం చేద్దాం. తెలంగాణ ప్రాంతం అంటే నాకు పిచ్చి ప్రేమ. వీర తెలంగాణ పోరాటం గురించి చదివినవాడిని. ఇక్కడ యువత, విద్యార్థులు, మహిళలు చెప్పిన విధంగా పార్టీని నిర్మిద్దాం. వారు అశించిన బంగారు తెలంగాణను సిద్ధంపచేద్దాం. బలం ఉన్న చోటు పోటీ చేద్దాం, మిగిలిన చోట్ల ప్రభావితం చేద్దాం. తెలంగాణ పోరాట సమయంలో ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర పాలకుల్ని వేరు చేసి చూడమని గద్దర్ లాంటి వారితో చెప్పాను. తెలంగాణలో అయినా ఉత్తరాంధ్రలో అయినా వెనుకబాటుతనం, దోపిడికి కారణం ఒక ప్రాంతమో కులమో కాదు పాలకులు వారి వారి కుటుంబాలే’’ అని అన్నారు.

ఆ తర్వాత ‘‘అందరూ తమ హక్కుల గురించి మాట్లాడుతారు. అంతకంటే ముందు బాధ్యత తీసుకోవాలి. నేను బాధ్యత తీసుకుంటాను, మాటలు పడతాను. అయినా భయపడను కాబట్టే ప్రశ్నించగలను. బాధ్యత తీసుకున్నవారికే ప్రశ్నించే హక్కు ఉంటుంది. బాధ్యత ఉంటే ఏ సమస్యని సయోధ్య ద్వారా సర్దుబాటు చేయవచ్చు అని విశ్వసిస్తారు. ఈ దేశానికి సంబంధించి సమగ్రత, సమైక్యతను కాపాడటం మనందరి బాధ్యత. రాజ్యాంగాన్ని కాపాడుకోవటం మన ధర్మం’’ అని పేర్కొన్నారు.

Posted On 15th August 2018