విషమంగా వాజ్‌పేయి ఆరోగ్యం
విషమంగా వాజ్‌పేయి ఆరోగ్యం

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. కిడ్నీ సమస్య, వృద్ధాప్య సమస్యలతో కొద్దికాలంగా  బాధపడుతున్న వాజ్‌పేయి ఇటీవల AIMS లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బుధవారంనాడు క్షీణించడంతో పార్టీ అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుని AIMS చేరుకుంటున్నట్టు పార్టీ వర్గాలు సమాచారం. విషయం తెలిసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎయిమ్స్ కు వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సదుపాయలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాజ్‌పేయిన గత వారంలో హోం మంత్రి రాజ్‌నాథ్ ఎయిమ్స్‌కు వెళ్లి పరామర్శించారు. వాజ్‌పేయి ఆరోగ్య పరస్థితి దృష్ట్యా గురువారంనాడు పార్టీ అధికారిక కార్యక్రమాలు వాయిదా పడినట్టు తెలుస్తోంది.

Posted On 15th August 2018