బాలయ్య... అచ్చు ఎన్టీఆర్ లా

బాలకృష్ణ ఎన్టీఆర్ లా మారిపోయారు, ఎక్కడంటే ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా మంగళవారం ‘ఎన్టీఆర్‌’ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ లుక్ లో బాలయ్యని చూస్తే అచ్చు ఎన్టీఆర్ లా అనిపిస్తున్నారు. అంతలా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు బాలకృష్ణ. ఎన్‌.బి.కే ఫిలిమ్స్‌, వారాహి చలన చిత్రం సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.

Posted On 15th August 2018