మచ్చల పులి... ముఖం మీద గాండ్రిస్తే

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా ‘అర‌వింద స‌మేత‌’. ఈ సినిమాను హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. డైలాగ్స్ మరియు ఫైట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏది ఏమైనా త్రివిక్రమ్ తన శైలికి భిన్నంగా మాస్ టీజర్ తో ఆశ్చర్యపరిచాడు.

టీజర్ లో డైలాగ్స్ ఇవే...

‘‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా?

మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా..?

మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా..? 

అంటూ జగపతిబాబు

 ‘‘కంటబడ్డావా.. కనికరిస్తానేమో.. ఎంటబడ్డనా నరికేస్తాఓబా..’’ 

అంటూ యంగ్ టైగర్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Posted On 15th August 2018