మోదుగుల చూపు... YSR కాంగ్రెస్ వైపు
మోదుగుల చూపు... YSR కాంగ్రెస్ వైపు

మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 2009 లో టిడిపి తరపున నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి అద్రృష్టవశాత్తు తక్కువ మెజార్టీ తో విజయం సాధించారు. అయితే 2014 లో చంద్రబాబు గుంటూరు వెస్ట్ అసెంబ్లీ సీటు ఇచ్చి ప్రోత్సహించారు. గుంటూరు వెస్ట్ స్థానానికి ఎంతో పోటీ ఉన్నా కూడా చంద్రబాబు మోదుగులకే అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. అయినప్పటికీ చంద్రబాబుపై, పార్టీపై ఏదోఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు.
ఎమ్మెల్యేగా ఎన్నికై ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ నియోజకవర్గంలో సరైన పట్టు సాధించలేకపోయారు. నాలుగేళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదు.
ఆయనపై ప్రజలతో పాటు పార్టీ వర్గాల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది, ఎందుకంటే...
జిల్లాలో ఏ నాయకుడితో కూడా సఖ్యంగా వ్యవహరించరనే ప్రచారం, గుంటూరు నగర కమీషనర్ తో విభేదాలు, ఒక వర్గానికి చెందినవాళ్ళకే ప్రయారిటీ ఇవ్వడం.
ఇంత అసంతృప్తి ఉంది కనుక పార్టీలో టికెట్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఒకవేళ వచ్చినా ఆయనపై ఉన్న వ్యతిరేకతతో గెలిచే పరిస్థితి లేదు. అందుకే నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని ఆయన ఆలోచిస్తున్నారట. టిడిపిలో ఎంపీ టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో, వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తుంది.
ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక వర్గానికి సంబంధించిన వనభోజనాల్లో పాల్గొన్న ఆయన టిడిపి పై విమర్శలు చేశారు, అంతేగాక వైఎస్ రాజశేఖరరెడ్డి పై ప్రశంశల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా టిడిపి లో రెడ్డి కులస్తులకు ప్రాధాన్యం లేదని వ్యాఖ్యానించారు. దీంతో ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.

Posted On 4th December 2018