హ్యాకింగ్‌ కి గురైన 100 ప్రభుత్వ వెబ్‌సైట్లు
హ్యాకింగ్‌ కి గురైన 100 ప్రభుత్వ వెబ్‌సైట్లు

సైబర్‌ నేరాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్ కి గురవడం. 2018 జనవరి నుంచి నవంబర్‌ మధ్య కాలంలో 100కు పైగా ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యాకింగ్‌ బారిన పడ్డాయి.
అందులో అధికశాతం నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) నిర్వహణలో ఉన్నవే కావడం విశేషం.

2017 నుండి 2018 వరకు 105 ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్ కి గురయ్యాయి ( ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ-ఇన్‌) నివేదిక ప్రకారం )

ఏటీఎంలు, కార్డులు, పీఓఎస్‌, యూపీఐ వ్యవస్థల్లో 2016లో 3, 2017లో 14, 2018 నవంబర్‌ లోపు 6 ఆర్థిక మోసాల ఘటనలు చోటు చేసుకున్నాయని మంత్రి అహ్లువాలియా వెల్లడించారు.

ఇక భారతీయ రిజర్వు బ్యాంకు నివేదిక ప్రకారం ఏటీఎం/డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ విభాగాల్లో 2015-16లో 1,191, 2016-17లో 1,372, 2017-18లో 2,059, 2018-19 (2018 సెప్టెంబర్‌ 30 లోపు) 921 ఆర్థిక మోసాలు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల్లో నగదు విలువ రూ.లక్షకు పైనే కావడం గమనార్హం. డిజిటల్‌ చెల్లింపులు జరిపేటప్పుడు భద్రత పాటించాలని వినియోగదారులకు 28 సూచనలు జారీ చేశామని పేర్కొన్నారు. ఇక 2017లో 53,081 సైబర్‌ సెక్యూరిటీ ఘటనలు చోటు చేసుకోగా అందులో 53 ర్యాన్సమ్‌వేర్‌ కేసులు ఉన్నాయని అహ్లువాలియా వెల్లడించారు.

Posted On 20th December 2018