భారత క్రికెటర్లలో ధోనీ నే బెస్ట్‌ - కపిల్ దేవ్
భారత క్రికెటర్లలో ధోనీ నే బెస్ట్‌ - కపిల్ దేవ్

మహేంద్ర సింగ్‌ ధోనీపై కపిల్‌ దేవ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ క్రికెటర్లలో ధోనీ వంటి క్రికెటర్‌ లేడని కితాబి. మంగళవారం ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌ దేవ్‌ మాట్లాడుతూ

‘భారతీయ క్రికెట్‌ చరిత్రలో ఇంతవరకు వచ్చిన టీమిండియా క్రికెటర్లలో ధోనీ అత్యంత గొప్ప క్రికెటర్‌. 90 టెస్టులు ఆడిన తర్వాత ధోని హఠాత్తుగా రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. తొలుత ధోనీ నిర్ణయాన్ని నేను కూడా తప్పు పట్టాను. కానీ తన నిర్ణయంలో ఉన్న అంతరార్థం నాకు తర్వాత బోధపడింది. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలన్న సదుద్దేశంతోనే ధోనీ టెస్టులకు దూరమయ్యాడు. తన నిర్ణయానికి నా జోహార్లు. కెప్టెన్సీ నుంచి ధోనీ దూరమయినా అతడిలో ఆ లక్షణాలు మాత్రం ఎక్కడికీ పోలేదు. అతడెలాంటి క్రికెటరో యావత్‌ క్రికెట్‌ అభిమాన లోకానికి తెలుసు. 2019 ప్రపంచకప్‌లో మరోసారి ధోనీని చూస్తాననుకుంటున్నాను. 2011లో ప్రపంచ కప్‌ సమరాన్ని ధోనీ అద్భుతంగా ముగించాడు. అతడి సలహాలు, సూచలను ఇప్పటికీ టీమిండియాకు ఎంతో అవసరం’ అని చెప్పుకొచ్చాడు.

అయితే టీమిండియా ప్రపంచ కప్ రెండు సార్లు గెలవగా మొదటిది కపిల్‌ దేవ్ సారథ్యంలో 1983లో, ధోనీ సారథ్యంలోని టీమిండియా 2011లో గెలవడం విశేషం.

Posted On 20th December 2018