కిదాంబి శ్రీకాంత్‌ శుభారంభం
కిదాంబి శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశాడు. రష్యా ఆటగాడు సెర్గీ సిరాంత్‌ను 21-13, 21-12 తేడాతో చిత్తుచేశాడు. ఎలాంటి శ్రమ పడకుండా ఆడిన కిదాంబి ప్రత్యర్థిని 29 నిమిషాల్లో ఓడించాడు. వరుస పాయింట్లతో సెర్గీని ఉక్కిరి బిక్కిరి చేశాడు. తర్వాతి రౌండ్‌కు దూసుకుపోయాడు.

Posted On 22nd August 2017

Source andhrajyothi