చిత్తూరు సుక్క మాంసం
చిత్తూరు సుక్క మాంసం

కావల్సినవి: 

ఎముకల్లేని మాంసం- కేజీ, ఉల్లిపాయలు- ఐదు, టొమాటోలు - నాలుగు, పచ్చిమిర్చి - ఆరు, అల్లంవెల్లుల్లి ముద్ద - మూడు చెంచాలు, కరివేపాకు - రెబ్బ, ఎండుమిర్చి - నాలుగు, మిరియాలు - రెండు చెంచాలు, మెంతులు - చెంచా, యాలకులు - రెండు, దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగాలు - నాలుగు, జీలకర్ర - చెంచా, ధనియాల పొడి- రెండు చెంచాలు, పసుపు- అర చెంచా, కారం- రెండు చెంచాలు, నిమ్మరసం- రెండు చెంచాలు, నూనె- అరకప్పు, ఉప్పు- రుచికి సరిపడా

తయారీ: 

ఓ గిన్నెలో మటన్‌ ముక్కలు తీసుకుని రెండు చెంచాలు అల్లం వెల్లులి ముద్ద, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి అరగంట సేపు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత కుక్కర్‌లో ఈ ముక్కలు తీసుకుని రెండు కప్పుల నీళ్లు పోసి నాలుగైదు కూతలు వచ్చేవరకూ ఉడికించుకోవాలి. ఈ ముక్కలు ఉడికేలోగా ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మెంతులు దోరగా వేయించుకుని పొడిచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి.. నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి దోరగా వేగాక ముందుగా కొట్టిపెట్టుకున్న పొడిలో సగం, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి. ఆ పై తరిగిన టొమాటో ముక్కలూ, మటన్‌ కూడా వేసుకోవాలి. అవన్నీ ఉడికాక చివరిగా తక్కిన మసాలా పొడీ వేసి దింపేయాలి. చివరిగా కరివేపాకు, నిమ్మరసం వేసి దింపేస్తే చాలు.

Posted On 3rd July 2017

Source eenadu