కాఫీతో దీర్ఘాయుష్షు
కాఫీతో దీర్ఘాయుష్షు

కాఫీ ప్రియులకు శుభవార్త! గుండె జబ్బులు, క్యాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులతో మరణించే ముప్పు.. కాఫీ తాగే వ్యక్తుల్లో తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. తద్వారా వ్యక్తుల దీర్ఘాయుష్షుకు కాఫీ కారణమవుతోందని సూచించారు. కాఫీకి దూరంగా ఉండే వ్యక్తులతో పోలిస్తే.. రోజుకో కప్పు కాఫీని సేవించే వ్యక్తులు క్యాన్సర్‌, గుండెపోటు, మధుమేహం, మూత్రపిండాల వైఫల్యం కారణంగా కన్నుమూసే ముప్పు 12 శాతం తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. రోజుకు రెండు, మూడు కప్పుల కాఫీ తాగే వ్యక్తుల్లో ఈ ముప్పు మరింత తక్కువగా (18 శాతం) ఉందని తెలిపారు. సాధారణ కాఫీలు తాగిన వ్యక్తులతోపాటు కెఫీన్‌ రహిత కాఫీలు తాగినవారిలోనూ ఈ ఫలితాలు ఒకేలా కనిపించాయని పేర్కొన్నారు.

Posted On 12th July 2017

Source eenadu