చిరంజీవి, చరణ్ మల్టీస్టారర్
చిరంజీవి, చరణ్ మల్టీస్టారర్

మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కలిసి మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో నటించారు. ఖైదీ నం 150 లో ఇద్దరు ఒక పాటలో సందడి చేయడం చూశాం. అయితే మ‌రోసారి అభిమానుల‌కు క‌నువిందు చేయడానికి సిద్ధమవుతున్నారు.
మల‌యాళ సూపర్‌స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన చిత్రం `లూసిఫ‌ర్‌`. ఈ చిత్రం మళయాళ బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద విజ‌యాన్నే నమోదు చేసుకుంది. మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌డ‌మే కాకుండా కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను రామ్‌చ‌ర‌ణ్ ద‌క్కించుకున్నార‌ని పృథ్వీరాజ్ తెలియ‌జేశారు.

అయితే చిరంజీవి త‌దుప‌రి త‌న 152వ చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాతే `లూసిఫ‌ర్` రీమేక్ తెర‌కెక్కుతుందట‌. మోహ‌న్ లాల్ పాత్ర‌లో చిరంజీవి, పృథ్వీరాజ్ పాత్ర‌లో రామ్‌చ‌రణ్ న‌టిస్తార‌ని టాక్‌. ఇది గానీ నిజమైతే అభిమానులకు పండగే.

Posted On 6th October 2019