‘కాటమరాయుడు’ మేకింగ్ వీడియో

‘కాటమరాయుడు’ సినిమా సెట్‌లో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, నటుడు అలీ చాలా సరదాగా సమయాన్ని గడిపారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను చిత్ర బృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. అందులో పవన్‌.. అలీతో ఓ ఆట ఆడుకుంటూ కనిపించారు. 50 సెకన్ల నిడివిగల ఈ వీడియోలోని ప్రతి సన్నివేశంలో పవన్‌ నవ్వుతూనే ఉండటం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. దాదాపు పవన్‌ నటించిన ప్రతి సినిమాలోనూ అలీ ఉంటారు.. వీరిద్దరు మంచి స్నేహితులు కూడా.

డాలీ దర్శకత్వం వహిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Posted On 14th March 2017

Source eenadu