కొబ్బరి కీరా పానీయం
కొబ్బరి కీరా పానీయం

కావల్సినవి:

కొబ్బరి నీళ్లు- కప్పు,

కీరా రసం- అరకప్పు,

పుదీనా ఆకులు- కొన్ని,

నిమ్మరసం - చెంచా,

కీరదోస ముక్కలు - కొన్ని,

చక్రాల్లా తరిగిన నిమ్మకాయ ముక్కలు - రెండుమూడు,

ఉప్పు-కొద్దిగా. 
తయారీ: ఒక మూత ఉన్న సీసాలో పై పదార్థాలన్నీ తీసుకుని బాగా కలపాలి. తరవాత గ్లాసుల్లోకి తీసుకుని నాలుగైదు ఐసు ముక్కలు వేసుకుని చల్లచల్లగా తాగితే బాగుంటుంది. కావాలంటే పైన కాస్త నల్ల ఉప్పు చల్లుకుంటే సరి.

Posted On 11th April 2017

Source eenadu