ఎయిడ్స్‌కు మీ ముక్కులోనే మందుందట..
ఎయిడ్స్‌కు మీ ముక్కులోనే మందుందట..

ముక్కులో పొక్కులను వేళ్లతో తీయడం చెడు అలవాటుగా పిల్లలకు చెబుతుంటాం. దీని వల్ల ముక్కులోని సున్నితమైన చర్మానికి నష్టం జరుగుతుందని, సైనస్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తాయనీ కొందరు చెబుతారు. అయితే, ఇప్పుడు ఈ అలవాటు మంచిదని, ముక్కు పొక్కులను తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ‘‘ముక్కు బ్యాక్టీరియాను వడకట్టే ఫిల్టర్‌లా పనిచేస్తుంది. ఈ సమయంలో ముక్కు పొక్కుల్లో కొంత బ్యాక్టీరియా కలుస్తుంది. ఈ మిశ్రమం కడుపులోకి వెళ్లినప్పుడు ఔషధంలా పని చేస్తుంది. ఎండిన ముక్కు పొక్కులను విదిల్చేయకుండా.. వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది. దీని వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది’’ అని అస్ట్రియాకు చెందిన ఊపిరితిత్తుల నిపుణుడు ప్రొఫెసర్‌ ఫ్రెడిరిక్‌ బిఛింగర్‌ పేర్కొన్నారు. ముక్కులోని చీమిడిలో మంచి బాక్టీరియా ఉంటుందని, ఇది పళ్ల చిగుళ్లను కాపాడుతుందని హార్వర్డ్‌ యూనివర్సిటీ, మసాఛూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. చీమిడి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, కడుపులో అల్సర్లు రాకుండా చేస్తుందని, ఎయిడ్స్‌ను కూడా నిరోధిస్తుందని చెప్పారు.‘‘ప్రకృతి కొన్నింటిని తినమని ప్రేరేపిస్తుంటుంది. అందులో భాగంగానే కొందరు ముక్కు పొక్కులను తింటుంటారు. ఈ సహజమైన అలవాటును ఇక మానుకోనక్కర్లేదు’’ అని కెనెడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సస్కాట్‌‌ఛివాన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్కాట్‌ నప్పర్‌ పేర్కొన్నారు. కాగా, చీమిడి వల్ల కలిగే ప్రయోజనాలను పొందడం కోసం.. కృత్రిమ చీమిడితో టూత్‌ పేస్ట్‌ తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
 

Posted On 28th April 2017

Source andhrajyothi