మామిడి కుల్ఫీ
మామిడి కుల్ఫీ

కావల్సినవి:

పాలు - ఒకటింబావు కప్పు,

బాగా చిక్కగా మరిగించిన పాలు - పావుకప్పు,

చక్కెర - పావుకప్పు,

మొక్కజొన్నపిండి - చెంచా,

మామిడిగుజ్జు - అరకప్పు,

యాలకులపొడి - పావుచెంచా. 
తయారీ: ఓ గిన్నెలో పాలు, చక్కెర తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి సగం అయ్యాక మొక్కజొన్న పిండి కలపాలి. ఇవి మరిగాక చిక్కగా మరిగించిన పాలను పోసి మంట తగ్గించి కలుపుతూ ఉండాలి. ఐదు నిమిషాలయ్యక యాలకులపొడి వేసి దింపేయాలి. ఇప్పుడు ఈ పాల మిశ్రమం, మామిడిపండు గుజ్జు తీసుకుని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. దీన్ని కుల్ఫీ పాత్రలో తీసుకుని ఎనిమిది గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచి తీసేయాలి.
 

Posted On 18th April 2017

Source eenadu