సమ్మర్ స్పెషల్...కీర సలాడ్
సమ్మర్ స్పెషల్...కీర సలాడ్

కావల్సినవి: కీరదోస - మూడు, వేయించిన పల్లీలు - కప్పు, ఉప్పు - తగినంత, చక్కెర - చెంచా, నిమ్మకాయలు - రెండు (రసం తీసుకోవాలి), కొత్తిమీర తరుగు - పావుకప్పు.

తయారీ: కీరదోస చెక్కు తీసి ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. పల్లీలను మరీ మెత్తగా కాకుండా పొడిచేసుకుని కీరదోసపై వేసేయాలి. ఇప్పుడు నిమ్మకాయల నుంచి రసం తీసుకుని అందులో తగినంత ఉప్పూ, చక్కెరా వేసి కీరదోస ముక్కలపై వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర అలంకరిస్తే సరిపోతుంది.

Posted On 6th May 2017

Source eenadu