కొబ్బరిపాలూ చికెన్‌
కొబ్బరిపాలూ చికెన్‌

కావల్సినవి:

చికెన్‌ - కేజీ,

ఉల్లిపాయలు - రెండు,

అల్లం తరుగు - రెండు పెద్ద చెంచాలు,

వెల్లుల్లి తరుగు - మూడు పెద్ద చెంచాలు,

కరివేపాకు రెబ్బలు - రెండు,

బంగాళాదుంపలు - రెండు,

ధనియాలపొడి - పెద్ద చెంచా,

కారం - రెండు పెద్ద చెంచాలు,

గరంమసాలా - చెంచా,

పసుపు - అరచెంచా,

చిక్కని కొబ్బరిపాలు - కప్పు,

నూనె - అరకప్పు,

కొత్తిమీర - కట్ట,

యాలకులు - మూడు,

లవంగాలు - రెండు,

దాల్చిన చెక్క - చిన్న ముక్క,

ఉప్పు - తగినంత. 
తయారీ: పొయ్యిమీద బాణలి పెట్టి.. నూనె వేయాలి. అది వేడయ్యాక యాలకులూ, లవంగాలూ, దాల్చినచెక్కా వేయించుకోవాలి. తరవాత ఉల్లిపాయ ముక్కలూ, అల్లం, వెల్లుల్లి తరుగూ, కరివేపాకు రెబ్బలు వేయాలి. అవి ఎర్రగా వేగాక ధనియాలపొడీ, కారం, పసుపూ, గరంమసాలా వేసి వేయించాలి. రెండు నిమిషాలయ్యాక చికెన్‌ ముక్కలూ, బంగాళాదుంప ముక్కలూ, కప్పు నీళ్లూ, తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. చికెన్‌ ఉడికాక కొత్తిమీర తరుగూ, కొబ్బరిపాలు పోసి మూత పెట్టేయాలి. కాసేపటికి ఇది దగ్గరగా అవుతుంది. అప్పుడు దింపేయాలి.

Posted On 29th April 2017

Source eenadu