బ్రెడ్‌ కట్‌లెట్‌
బ్రెడ్‌ కట్‌లెట్‌

కావలసిన పదార్థాలు

బ్రెడ్‌ స్లయిస్‌లు - 2, ఉడికించి,

మెదిపిన ఆలూ - 3,

ఉప్పు, కారం, గరం మసాల పొడి - అర టీ స్పూను చొప్పున,

పసుపు - పావు టీ స్పూను,

ఉల్లి తరుగు - 1 టేబుల్‌ స్పూను,

కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు,

నూనె - వేగించడానికి సరిపడా.

బ్రెడ్‌ పొడి/గసగసాలు - అరకప్పు,

మైదా - 1 టేబుల్‌ స్పూను.

తయారుచేసే విధానం

బ్రెడ్‌ స్లయిస్‌లను నీటిలో 30 సెకన్లు ఉంచి వెంటనే తీసి పిండేయాలి. తర్వాత ఒక పాత్రలో మిగతా పదార్థాలతో పాటు (నూనె తప్పించి) వేసి ముద్ద చేసుకోవాలి. దళసరిగా చపాతీలా రోల్‌గా వత్తుకుని (పిల్లలు ఇష్టపడే) షేపులో కట్‌ చేసుకోవాలి. వీటిని మైదా జారులో ముంచి బ్రెడ్‌ పొడి లేదా గసగసాలు అద్ది నూనెలో దోరగా వేగించాలి.

Posted On 16th June 2017

Source andhrajyothi