బూంది పాయసం
బూంది పాయసం

కావల్సినవి:  
బూందీ - ముప్పావు కప్పు,

చిక్కని పాలు - ఐదు కప్పులు,

బిర్యానీ ఆకులు - మూడు,

చక్కెర - ఐదు టేబుల్‌స్పూన్లు,

గులాబీనీరు - అరచెంచా,

యాలకులపొడి - చెంచా. 
తయారీ:
పాలను అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి కొద్దిగా వేడయ్యాక బిర్యానీ ఆకులు వేయాలి. కాసేపటికి పాలు సగం అవుతాయి. అప్పుడు బిర్యానీ ఆకులు తీసేయాలి. తరవాత చక్కెర వేసి మంట తగ్గించాలి. రెండు నిమిషాలకు చక్కెర కరుగుతుంది. అప్పుడు బూందీతో పాటూ మిగిలిన పదార్థాలన్నీ వేసి ఓసారి కలపాలి. ఈ పాలు చల్లారాక రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచి.. తరవాత వడ్డించాలి. 

Posted On 25th May 2017

Source eenadu