బాలయ్య డ్యాన్స్ కుమ్మేసాడు... అమ్మకుట్టి సాంగ్ ప్రోమో

మాస్ ప్రేక్షకులు దేవుడిగా భావించే నందమూరి బాలకృష్ణ సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగులు, పోరాట గట్టాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటితో పాటుగా ఒక్కటైనా మాస్ మసాలా సాంగ్, ఆ సాంగ్ కు బాలయ్య బాబు ఎనర్జిటిక్ డ్యాన్స్ ఉండాల్సిందే.

బాలకృష్ణ కొత్త సినిమా ‘జై సింహ ’ సంక్రాంతికి రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రంలోని ‘అమ్మకుట్టి అమ్మకుట్టి ’ సాంగ్ ప్రోమోని చిత్ర యూనిట్ YouTube లో రిలీజ్ చేసారు. ఆ పాటలో బాలయ్య ఎనర్జిటిక్ మూవ్స్ తో అదరగొట్టారు. 56 సంవత్సరాల వయస్సులో కుర్రహేరోలతో పోటీగా స్టెప్స్ వేసారు.

ఈ పాటకు థియేటర్ లో మాస్ ఆడియన్స్ కు పూనకాలే.

Posted On 1st January 2018