దగ్గరికొస్తే ఛార్జింగ్‌
దగ్గరికొస్తే ఛార్జింగ్‌

మొబైల్‌లో ఛార్జింగ్‌ తక్కువుంది... వూరుకెళ్లాలి... బస్సులో ఛార్జింగ్‌ పాయింట్‌ ఉంటుందో లేదో! 
ఎలక్ట్రిక్‌ బైక్‌ మీద లాంగ్‌ జర్నీ చేద్దామంటే మధ్యలో ఎక్కడైనా ఛార్జింగ్‌ అయిపోతుందేమో అని భయం. 
ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ల వినియోగదారులు త్వరలో ఇలాంటి ఇబ్బందులన్నింటికీ చెక్‌ పెట్టొచ్చు. ‘నియర్‌బై’ ఆప్షన్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను ఛార్జింగ్‌ పెట్టుకునేలా స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రత్యేక విద్యుత్తు కెపాసిటర్లను రూపొందించారు. గ్యాడ్జెట్లు వీటి దగ్గర్లోకి వస్తే ఛార్జింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. మామూలు రోడ్డు కింద ఈ ఛార్జింగ్‌ కెపాసిటర్లను ఏర్పాటు చేస్తారు. వాటిపై విద్యుత్తుతో పని చేసే కార్లు, బైక్‌లు ప్రయాణించినప్పుడు కెపాసిటర్ల నుంచి విద్యుత్తు అందుకొని అవి ఛార్జ్‌ అవుతాయి. ఇటీవల దీనికి సంబంధించిన ట్రయిల్స్‌ జరిగాయి. అట్లాగే కెపాసిటర్లకు దగ్గరగా ఉండే మొబైల్స్‌, ట్యాబ్స్‌ కూడా ఛార్జ్‌ అవుతాయని శాస్త్రవేత్తల చెబుతున్నారు.

Posted On 29th June 2017

Source eenadu