మీ ఫోన్ రేడియేషన్ ఎంతో తెలుసుకోవాలంటే ?

మనం ఏదైనా కొత్త ఫోన్ కొనాలంటే ముందు ర్యామ్, బ్యాటరి, కెమెరా, ఇంటర్నల్ మెమరీ, ప్రాసెస్సర్ లాంటి ఫీచర్స్ చూసుకొని కొంటాం. వీటన్నిటితో పాటు ధర కూడా చూస్తాం.

కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే ఫోన్ రేడియేషన్ లెవెల్, ఫోన్ రేడియేషన్ ను SAR ( Specific Absorption Rate) ఆధారంగా తెలుసుకోవచ్చు. మనదేశం లో SAR లెవెల్ 1.6 w/kg కి మించి ఉండకూడదు. మాక్సిమం లెవెల్ 1.6 అయినప్పటికీ 1.0 కంటే తక్కువ SAR లెవెల్ ఉన్న ఫోన్ ని వాడడం మంచిది.

SAR లెవెల్ ఎలా చెక్ చేస్కోవాలంటే…

మీ మొబైల్ నుండి *#07# కి డయల్ చేస్తే, వెంటనే SAR వేల్యూ తో అలెర్ట్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది.

ఒకవేళ మొబైల్ అందుబాటులో లేకుంటే, మీరు తీసుకోవాల్సిన మోడల్ ఫీచర్స్ వెబ్ లో చెక్ చేసుకోవచ్చు. మొబైల్ ఫీచర్స్ చెక్ చేసుకోవడానికి మనకు బోలెడన్ని వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి.

Posted On 4th March 2018