Redmi నుండి నోట్ 5... లీకైన ఫీచర్స్
Redmi నుండి నోట్ 5... లీకైన ఫీచర్స్

ప్రముఖ చైనా మొబైల్‌ దిగ్గజ కంపెనీ షియోమీ ఈ ఏడాది రెడ్‌మి నోట్‌ 4 మోడల్‌తో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సంస్థ ఇదే సిరీస్‌లో నోట్‌ 5ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా బయటికొచ్చిన సమాచారం ప్రకారం ఈ మోడల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 630 ప్రాసెసర్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ నూగట్‌ ఆధారంగా ఎంఐయూఐ 9.0 వెర్షన్‌తో పనిచేస్తుందని సమాచారం. నోట్‌ 4లో స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌ను వినియోగించిన సంగతి తెలిసిందే. అయితే రెడ్‌మి నోట్‌ 5ను ఎప్పుడు విడుదల చేస్తారనే అంశంపై ఇప్పటి వరకూ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇక రెడ్‌మి సిరీస్‌లో బడ్జెట్‌ ఫోన్లను అందిస్తున్న కంపెనీ ఈ మోడల్‌ను సైతం అందుబాటు ధరల్లో విడుదల చేసే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటి వరకూ బయటికొచ్చిన వూహాగానాల ప్రకారం.. 
5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌తో ఈ మోడల్‌ ఉండే అవకాశం ఉంది. ఈసారి 2జీబీ ర్యామ్‌ వేరియంట్‌ను నిలిపివేసి.. 3జీబీ ర్యామ్‌, 4 జీబీ ర్యామ్‌ వేరియంట్లలో నోట్‌ 5ను విడుదల చేస్తుందని భావిస్తున్నారు.64 జీబీ అంతర్గత మెమొరీ ఉండొచ్చని తెలుస్తోంది. 13 ఎంపీ, 16 ఎంపీఫ్రంట్‌, వెనక కెమెరాలను పొందుపరిచారట. 3,790 ఎంఏహెచ్‌ బ్యాటరీ దానికి వేగవంతమైన ఛార్జింగ్‌ సదుపాయంతో ఈ మోడల్‌ను విడుదల చేస్తారని చెబుతున్నారు.

Posted On 4th July 2017

Source eenadu