భారతీయుల దెబ్బకు ‘Snapchat’ విల విల
భారతీయుల దెబ్బకు ‘Snapchat’ విల విల

సీఈవో ఇవాన్‌ స్పైగల్‌ వ్యాఖ్యలతో స్నాప్‌చాట్‌ రేటింగ్‌ ఒక్క రోజులోనే కుంగింది. 2015లో జరిగిన ఒక సమావేశంలో స్పైగల్‌ మాట్లాడుతూ.. ‘స్నాప్‌ చాట్‌ భారత్‌, స్పెయిన్‌ వంటి పేదదేశాల్లో విస్తరించాలనుకోవటంలేదని.. ప్రీమియం కస్టమర్లపైనే దృష్టిపెట్టాలి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలను వెరైటీ మీడియా అనే సంస్థ బయటకు తీసుకొచ్చింది. దీంతో ఇవి ఒక్కసారిగా దుమారం రేపాయి. భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసి స్పైగల్‌ను పేదవాడిగా మార్చాలని ఫేస్‌బుక్‌లో ప్రచారం ప్రారంభించారు. ఫలితంగా గూగుల్‌ ప్లేస్టోర్‌లో స్నాప్‌ చాట్‌ రేటింగ్‌ ఒక్కరోజులోనే కుంగింది. నిన్నటి వరకూ 4.4 రేటింగ్‌ ఉన్న ఈయాప్‌ నేడు 4.0కు పడిపోయింది. ఒకానొకదశలో 3.6కు చేరింది. ప్లేస్టోర్‌లో రివ్యూలు చాలా వరకు స్పైగల్‌ను విమర్శించారు.

పెరిగిన సింగిల్‌స్టార్‌
స్నాప్‌చాట్‌కు సింగిల్‌స్టార్‌ రేటింగ్‌ తక్కువ వ్యవధిలో గణనీయంగా పెరిగిపోయింది. ఒక్కసారిగా 1,92,906కు చేరింది. ఇది స్నాప్‌చాట్‌ డౌన్‌లోడ్‌లపై ప్రభావం చూపిస్తుందని స్నాప్‌.ఇంక్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Posted On 16th April 2017

Source eenadu