జియోకి పోటీగా ఆఫర్ల వెల్లువ
జియోకి పోటీగా ఆఫర్ల వెల్లువ

రిలయన్స్ జియో దెబ్బతో వినియోగదారులు చేజారిపోకుండా ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌ సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటించి పోటీపడుతున్నాయి. జియో ప్రైమ్ సభ్యులకు రూ.309 రీఛార్జ్‌కి 84 రోజుల పాటు రోజూ 1 జీబీ, రూ.509 రీచార్జ్‌కి 2 జీబీ డేటా అందిస్తోంది. మిగతా కంపెనీల ఆఫర్లు చూస్తే..

ఎయిర్‌టెల్

- పోస్ట్‌ పెయిడ్‌ చందాదారులకు నెలకు 10జీబీ చొప్పున 3 నెలల పాటు 30జీబీ డేటా. దీనికి ఈ నెల 30లోగా మై ఎయిర్‌టెల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

- రూ.399 రీఛార్జ్‌తో అపరిమిత లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌. . 70 రోజులు రోజుకు 1జీబీ డేటా

- రూ.345 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా 2 జీబీకి పెంపు, రూ.549 ప్లాన్‌లో రోజుకు 2.5జీబీ డేటా

- రూ.244 ప్లాన్‌లో 1 జీబీ డేటా, ఉచిత కాల్స్‌. సొంత నెట్‌వర్క్‌కు 300 నిమిషాలు (రోజుకి), ఇతర నెట్‌వర్క్‌లకు 1200 నిమిషాలు (వారానికి)

వొడా ఫోన్

రూ.352తో రీఛార్జ్‌‌తో రోజుకు 1జీబీ 4జీ డేటా.. 56 రోజుల పాటు. లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ ఉచితం. అపరిమితం.

ఐడియా

-రూ.297తో రీఛార్జ్‌తో రోజుకు 1జీబీ డేటా. 70 రోజుల పాటు. 4జీ స్మార్ట్‌ఫోన్‌, 4జీ సిమ్‌ ఉండాలి. 4జీ స్మార్ట్‌ఫోన్‌ లేనివారికి రోజుకి 300 నిమిషాలు, వారానికి 1200 నిమిషాలు ఉచిత కాల్స్.

-రూ.447 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌తో 70 రోజుల పాటు 1జీబీ డేటా. అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత కాల్స్.

Posted On 17th April 2017

Source andhrajyothi