పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేయడం ఇలా
పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేయడం ఇలా

పాన్‌కార్డును ఆధార్‌కార్డుతో అనుసంధానించేందుకు సులభమైన ఆన్‌లైన్‌ పద్ధతిని ఆదాయపన్ను శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రిటర్నులు దాఖలు చేయాలంటే ఆధార్‌కార్డును పాన్‌కార్డుతో అనుసంధానించడం తప్పనిసరి. ఆదాయపన్ను శాఖకు చెందిన incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌ హోంపేజీలో తేలిగ్గా పాన్‌కార్డు ఆధార్‌కార్డులను అనుసంధానించవచ్చు. ఈ లింక్‌లో వ్యక్తి పాన్‌కార్డు సంఖ్య, దానికి అనుసంధానించే ఆధార్‌కార్డు సంఖ్య, ఆధార్‌కార్డుపై ఉన్న పేరు నమోదు చేయాలి. దీని వెరిఫికేషన్‌ పూర్తి అయ్యాక పాన్‌కార్డు, ఆధార్‌ అనుసంధానమైపోతాయి. పేరులో చిన్న చిన్న లోపాలు ఉంటే ఆధార్‌ ఓటీపీ ద్వారా దీనిని పూర్తి చేసుకోవచ్చు. ఈ ఓటీపీని రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్లు, ఈమెయిల్‌ అడ్రస్‌లకు పంపిస్తారు. పుట్టిన తేదీ, పాన్‌నెంబర్‌, ఆధార్‌లోని లింగవివరాలు కచ్చితంగా ఉంటే అనుసంధానం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

Posted On 11th May 2017

Source eenadu