డ్రైవర్‌ మూడ్‌ను బట్టి రంగు మారే కారు
డ్రైవర్‌ మూడ్‌ను బట్టి రంగు మారే కారు

యజమానిని ఆటోమాటిక్‌గా గుర్తించి సీట్లను సరిచేసుకోవడం, అతడి మూడ్‌ను బట్టి రంగుమార్చుకోవడం చేసే కారును జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల కంపెనీ బీఎమ్‌డబ్ల్యూ అభివృద్ధి చేస్తోంది. ఈ కారులో డ్రైవర్‌కు అనుగుణంగా డ్రైవింగ్‌ సీటు ఆటోమాటిక్‌గా మారుతుంది. కారు రంగు మారడమే కాకుండా సందేశాలనూ ప్రొజెక్ట్‌ చేస్తుంది. ‘మిని విజన్‌ నెక్స్ట్‌ 100’ గా పిలిచే ఈ కారు నమూనాను కొన్ని రోజుల క్రితం కంపెనీ ప్రదర్శించింది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ అత్యాధునిక కార్లను తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. బీఎమ్‌డబ్ల్యూ కంపెనీ వందేళ్లుగా కార్లను తయారు చేస్తోంది.

Posted On 30th April 2017

Source andhrajyothi