ఈ 4 టిప్స్ ఫాలో అయితే బ్యాంకు ఉద్యోగం గ్యారెంటీ
ఈ 4 టిప్స్ ఫాలో అయితే బ్యాంకు ఉద్యోగం గ్యారెంటీ

డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీజీ.. విద్యార్హత ఏదయినా సరే.. నేతి తరం యువత బ్యాంకు ఉద్యోగాలకై పరుగులు తీస్తోంది. కోచింగ్ సెంటర్ల ముందు పడిగాపులు కాస్తోంది. ఎస్బీఐ, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ.. అంటూ వరుసపెట్టి బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తులు చేస్తోంది. మొదటిసారి విఫలం అయినా.. విజయం కోసం మాటిమాటికీ నిరుద్యోగులు బ్యాంకు ఎగ్జాములు రాస్తూనే ఉన్నారు. లాంగ్‌టర్మ్, షార్ట్‌టర్మ్ అంటూ.. కోచింగ్ సెంటర్లు నిరుద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తోంది. కోచింగ్ సెంటర్ల సంగతి పక్కనపెడితే.. మొట్టమొదటి ప్రయత్నంలోనే బ్యాంకు ఉద్యోగం సాధించడం చాలా సులువు అంటున్నారు నిపుణులు. ఓ నాలుగు టిప్స్‌ను పాటిస్తే బ్యాంకు పరీక్షలను మొట్టమొదటి ప్రయత్నంలోనే పాసై.. కొలువులో కొలువుదీరడం గ్యారెంటీ అంటున్నారు. మరి ఆ నాలుగు టిప్స్ ఏంటో ఓ లుక్కేద్దామా..?
 
1. సిలబస్‌ను తూచా తప్పకుండా ఫాలో అవడం:
పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, క్లర్క్ అంటూ వచ్చే నోటిఫికేషన్స్‌కు వేటికవే సిలబస్ ఉంటుంది. రీజనింగ్, ఆప్టిట్యూడ్ లెవల్స్‌లో కూడా తేడా ఉంటాయి. సిలబస్‌ను తూచా తప్పకుండా పాటించి, అందులోని టాపిక్స్‌ను ఆసాంతం పూర్తి చేస్తే విజయానికి మొదటి మెట్టు ఎక్కినట్లే. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జాములకు అనుగుణంగా ప్రపరేషన్ ఉండాలి.
 
2. ఆన్సర్లు తెలియకపోతే వదిలేయండి
పరీక్షా సమయంలో ప్రశ్నలను చూసి చాలామంది కంగారుపడుతుంటారు. చదివాను కానీ గుర్తు రావడం లేదేంటని తర్జనభర్జన పడుతుంటారు. ఆందోళన చెందుతుంటారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి చివరకు ‘ఇదే కరెక్ట్ అనుకుంట’ అని ఓ ఆన్సర్‌ను టిక్ చేస్తుంటారు. ఈ పద్ధతికి స్వస్థి చెబితేనే మేలు. ప్రశ్నకు సమాధానం తెలియకపోతే వదిలేయండి. అనవసరంగా ఆలోచించి, ఒక్క ప్రశ్నకే ఎక్కువ సమయం కేటాయించి అంతిమంగా నష్టపోతారు. అందులోనూ నెగిటివ్ మార్కింగ్ ఉండనే ఉంది.
 
3. మాక్ టెస్టులు, మోడల్ పేపర్లు
పెళ్లికి ముందు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి.. అంటుంటారు కదా.. అదే విధంగా బ్యాంకు ఎగ్జాములే కాదు ఏ పరీక్ష అయినా.. గతంలో వచ్చిన ప్రశ్నా పత్రాలు, మోడల్ పేపర్ల అంతు చూడాల్సిందే. ప్రశ్నాపత్రాల సరళి ఎలా ఉంది.. ఇకపై ఎలా ఉండబోతోంది..? వంటి అంశాలపై క్షుణ్ణంగా అవగాహన సాధించాలి. ఈ ప్రశ్నాపత్రాలను సాధించడం ద్వారా అభ్యర్థుల్లో కాన్ఫిడెంట్ పెరుగుతుంది.
 
4. టైమ్ మేనేజ్‌మెంట్
బ్యాంకు ఎగ్జామ్‌ల పనిపట్టాలంటే.. ఎంతో ప్రణాళిక ఉండాలి. సిలబస్‌ను ఆసాంతం చదవడమే కాదు. దాన్ని కరెక్ట్‌గా ఎగ్జిగ్యూట్ చేస్తున్నామా..? లేదా..? అన్నది కూడా చాలా ముఖ్యం. దీనికి ప్రాక్టీస్ చాలా ముఖ్యం. రీజనింగ్, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్.. అంటూ ప్రతీ కేటగిరీకి సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ పోకుంటే చాలా కష్టం. అందుకే మోడల్ పేపర్లు, మాక్ టెస్టుల్లో పాల్గొంటే మీ సత్తా ఏంటో మీకే తెలుస్తుంది. తద్వారా మీలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీకు మీరే సరిదిద్దుకోగలరు. షార్ట్‌కట్‌లను సాధ్యమైనంత ఎక్కువగా తెలుసుకోవాలి.

Posted On 1st May 2017

Source andhrajyothi