నేడు పది ఫలితాలు
నేడు పది ఫలితాలు

తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఆర్‌.సురేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. కొత్త జిల్లాల ప్రకారమే ఉత్తీర్ణత శాతం, ఇతర వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. ఫలితాలను www.eenadu.net, www.eenadupratibha.net, www.bsetelangana.org, results.cgg.gov.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
వారి ఫలితాలూ ఇచ్చేయండి: కడియం 
అనుమతిలేని బడుల నుంచి పదోతరగతి పరీ క్షలు రాసిన వారి ఫలితాలను పక్కనపెట్టకుండా విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 బడులకు అనుమతులు లేకపోవడం, అందులో 74 పాఠశాలల నుంచి పదో తరగతి విద్యార్థులు ఉండటంతో వారిఫలితాలను పక్కన పెడుతున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఉపముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలనిఆయన ఆదేశించారు.

Posted On 3rd May 2017

Source eenadu