982 ఖాళీలతో ఏపీపీఎస్సీ గ్రూప్‌ - 2
982 ఖాళీలతో ఏపీపీఎస్సీ గ్రూప్‌ - 2

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌ - 2 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 982 ఖాళీలున్నాయి. వీటిలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 442, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 540 ఉన్నాయి.

ఎగ్జిక్యూటివ్‌ ఖాళీల వివరాలు: 
* మునిసిపల్‌ కమిషనర్‌: 12 
* అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌: 96 
* సబ్‌ రిజిస్ట్రార్‌: 27 
* డిప్యూటీ తహసీల్దార్‌: 253 
* అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌: 8 
* అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌: 23 
* ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌: 8 
* ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌: 15

నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: 
* అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌: 124 
* సీనియర్‌ ఆడిటర్‌: 45 
* సీనియర్‌ అకౌంటెంట్‌: 251 
* జూనియర్‌ అకౌంటెంట్‌: 39 
* జూనియర్‌ అసిస్టెంట్‌: 81

అర్హతల వివరాలు.... 
చాలావరకు పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. కొన్ని పోస్టులకు ప్రత్యేక అర్హతలున్నవారు కూడా అర్హులు. 
* సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులకు లా డిగ్రీ కూడా ఉంటే ప్రాధాన్యం ఇస్తారు. 
* ఏడీఓ పోస్టులకు టెక్స్‌టైల్‌ టెక్నాలజీ లేదా హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీలో డిప్లొమా ఉన్నవారు కూడా అర్హులు. 
* ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఎస్‌ఓ పోస్టులకు కామర్స్‌ / ఎకనమిక్స్‌ / మేథమేటిక్స్‌లో డిగ్రీ ఉన్నవారు అర్హులు. లా డిపార్ట్‌మెంట్‌లో ఏఎస్‌ఓ పోస్టులకు లాఉత్తీర్ణులు అర్హులు. 
* సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులకు కామర్స్‌ / ఎకనమిక్స్‌ / మేథ్స్‌లో డిగ్రీ లేదా ఏదైనా డిగ్రీతోపాటు ఆఫీస్‌ ఆటోమేషన్‌ / పీసీ మెయింటెనెన్స్‌ అండ్‌ ట్రబుల్‌ షూటింగ్‌ / వెబ్‌ డిజైనింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా బీసీఏ / బీఎస్సీ కంప్యూటర్స్‌ / బీకాం కంప్యూటర్స్‌ / బీఏ కంప్యూటర్స్‌ / కంప్యూటర్స్‌ లేదా ఐటీలో బీఈ / బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టుల వారీగా అర్హతల పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. 
* వయసు: సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులకు 20 - 42 ఏళ్ల మధ్య, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 18 - 28 ఏళ్ల మధ్య, మిగతా పోస్టులకు 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా అవసరం.

ఎంపిక విధానం: 
* స్క్రీనింగ్‌ టెస్ట్‌, మెయిన్‌ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అంతిమ ఎంపికకు మెయిన్‌ పరీక్షలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. 
* స్క్రీనింగ్‌ టెస్ట్‌: 150 మార్కులకు ఉంటుంది. ఇందులో కరెంట్‌ అఫైర్స్‌, భారత రాజ్యాంగం, భారతదేశంలో ఆర్థికాభివృద్ధి, తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. 
* మెయిన్‌ పరీక్ష: ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. 

పేపర్‌ - 1: జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 
పేపర్‌ - 2: ఆంధ్రప్రదేశ్‌ సామాజిక చరిత్ర, భారత రాజ్యాంగం 
పేపర్‌ - 3: భారతదేశంలో ప్రణాళికలు, భారత ఆర్థిక వ్యవస్థ, సమకాలీన సమస్యలు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ. 

* దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబరు 11 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. 
* చివరి తేది: 10 డిసెంబరు 
* స్క్రీనింగ్‌ టెస్ట్‌: 26 ఫిబ్రవరి 2017 
* మెయిన్‌ పరీక్ష: 20 మే 2017

Posted On 20th November 2016

Source eenadu