పాసులున్నా... ఆంధ్రలోకి అనుమతించని అధికారులు
పాసులున్నా... ఆంధ్రలోకి అనుమతించని అధికారులు

ఆంధ్రప్రదేశ్ లోని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం పాసులు జారీ చేసినా ఏపీ అధికారులు మాత్రం రాష్ట్రంలోకి వెళ్లేందుకు వారిని అనుమతించడంలేదు. ఖమ్మం, కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లోని క్వారంటైన్‌లో ఉండి ఐదు బస్సులు, రెండు మినీ లారీలు, ఐదు కార్లలో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతోపాటు ఒడిశాకు బయలుదేరిన వారిని అశ్వారావుపేట సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఏపీ అధికారులు నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పాస్ తమ వద్ద చెల్లదని, ఏపీ అధికారుల అనుమతి ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని తెగేసి చెప్పారు.

అయితే ఏపీ నోడల్‌ అధికారి M T కృష్ణబాబు ఫోన్ పనిచేయడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ విషయాన్ని అశ్వారావుపేట తహసీల్దార్‌ చల్లా ప్రసాద్‌ మరియు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. సరిహద్దు ఆహరం లేకుండా ఇబ్బంది పడుతున్న దాదాపు 300 మందికి పవన్‌ కల్యాణ్‌ సేవా సమితి అల్పాహారాన్ని సమకూర్చింది.

Posted On 3rd May 2020

Source eenadu