మెల్ల మెల్లగా... స్వైన్‌ఫ్లూ
మెల్ల మెల్లగా... స్వైన్‌ఫ్లూ

ఓ వైపు కరోనా పంజా విసురుతుంటే, మరోవైపు స్వైన్‌ఫ్లూ వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. NCDC (జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం) ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో ఈ సంవత్సరం జులై31 వరకు 2721 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇదికాక మరో 44 మంది స్వైన్‌ఫ్లూ తో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. స్వైన్‌ఫ్లూ కేసులు అధికంగా నమోదు అయిన రాష్ట్రాలు

కర్ణాటక - 458
తెలంగాణ(443)
దిల్లీ(412)
తమిళనాడు(253)
ఉత్తర్‌ప్రదేశ్‌(252)

ముఖ్యంగా గర్భవతులు, ఐదు సంవత్సరాలలోపు వయసుగల చిన్నారులు, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు మరియు వయసుపైబడిన వారిపై ఈ వైరస్‌ ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

అయితే కరోనా వైరస్‌, స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఒకేవిధంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో లక్షణాలున్న వారికి వైద్యులు కొవిడ్‌ పరీక్షతో పాటు ఇన్‌ఫ్లుయంజా పరీక్షలు కూడా నిర్వహించాలని సూచిస్తున్నారు.

ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలని శ్వాసకోస నిపుణులు సూచిస్తున్నారు.

Posted On 20th August 2020