కళ్ల ముందే కూలిన విమానం

రోడ్డుమీద వెళుతున్నప్పుడుచిన్న యాక్సిడెంట్‌ జరిగితేనే కంగారుపడిపోతాం. అలాంటిది ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద అమాంతం ఓ విమానం కిందకి వచ్చి మన కళ్లముందే పేలిపోతే? ఇలాంటి ఘటన అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో చోటుచేసుకుంది. ముకిల్‌టియో ప్రాంతంలో ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద వాహనాలు ఆగున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ ఓ విమానం కిందకి దూసుకొస్తూ కరెంటు తీగలని తగిలి ఫైర్‌బాల్‌లా కుప్పకూలిపోయింది. అది చూసి ఒక్క క్షణం పాటు అక్కడి వాహనదారులకి గుండె ఆగినంత పనైంది.

విచిత్రమేంటంటే.. సాధారణంగా విమానాలు రన్‌వే జారిపడినా ప్రయాణికులకు స్వల్పంగా గాయాలవుతుంటాయి. అలాంటి విమానం నిప్పులు చిమ్ముతూ నేలపై కూలినా అందులోని ప్రయాణికులకు, పైలట్‌కుచిన్న దెబ్బకూడా తగలకపోవడం గమనార్హం. అయితే విమానం కూలిపోతున్న సమయంలో దగ్గర్లోని ఓ కారుకి తగిలింది. ఆ సమయంలో ఓ మహిళ కూడా కారులో ఉంది. అదృష్టవశాత్తు ఆ మహిళకీ ఏమీ కాలేదు.

Posted On 5th May 2017

Source eenadu