ఆపరేషన్ గరుడ... చంద్రబాబే టార్గెట్

చంద్రబాబు టార్గెట్ గా, ఢిల్లీ నుంచి "ఆపరేషన్ గరుడ". ఇప్పటికే మొదలై, మొన్నటి దాక స్లో గా ఉన్న ఆపరేషన్, చంద్రబాబు ఎదురు తిరగిన దగ్గర నుంచి, ఢిల్లీ పెద్దలు మరింత దూకుడుగా వెళ్తున్నారు...

ఇన్నాళ్ళు ఈ దేశంలో తమ జైత్ర యాత్రకు, తాము బలమైన నేతలం అనే ఇమేజ్ చంద్రబాబు నాశనం చేసాడు అని, అందుకే మేము చంద్రబాబుని నాశనం చేస్తాం అని, ఢిల్లీ నాయకులు నిర్ణయించారు. అయితే, జూన్ నెలలో ఈ ఆపరేషన్ పై దూకూడుగా వెళ్లి, ఈ ఆపరేషన్ ముగించాలని నిర్ణయించారు. అందులో భాగంగా, రెండు నెలలు నుంచి దీని పై సన్నాహాలు చేసారు.

కొన్ని రోజుల క్రిందట, ఈ ఆపరేషన్ మొదలు పెట్టారు కూడా.. అయితే, అనూహ్యంగా చంద్రబాబు ఎదురు తిరగటంతో, ఈ ఆపరేషన్ పై ఇక దూకుడుగా వెళ్ళాలని, ఏప్రిల్ చివరి వారంలో కాని, మే మొదటి వారంలో కాని, ఈ ఆపరేషన్ పై దూకుడుగా వెళ్లి, పూర్తి చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఇందులో దారుణమైనది ఏంటి అంటే, మన వేలుతో మనల్నే పొడవటం. మన రాష్ట్ర నాయకులతో, మన రాష్ట్రం నాశనం చెయ్యటం...

అసలు ఏంటి ఈ ఆపరేషన్ గరుడ ?

  • దీని మెయిన్ టార్గెట్ చంద్రబాబు పతనం.
  • తద్వారా, రాష్ట్ర నాశనం.
  • తమిళనాడు తరహాలో రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థుతులు నెలకొల్పటం.
  • దీని కోసం ఇప్పటికే కేసులు భయంతో జగన్ ని లొంగదీసుకున్నారు...
  • జగన్ పై, ప్రజల్లో నమ్మకం అంతగా ఉండదు అని తెలుసుకుని, పవన్ ని, ఐటి రైడ్స్ లో దొరికిన కొన్ని ఇబ్బందికర మెటీరియల్ తో లొంగదీసుకున్నారు..
  • పవన్ తో గత రెండు నెలల నుంచి, అత్యంత పెద్ద రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వ్యక్తి, రాయబారం జరిపి, బీజేపీతో డీల్ సెట్ చేసారని ఇప్పటికే మెయిన్ స్ట్రీం మీడియాలో వార్తలు కూడా వచ్చాయి...
  • ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ ప్రకటన, రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ గా రామ్ మాధవ్...
  • వీటన్నటితో పాటు, అటు జగన్ కేసులు నీరుగార్చటం...
  • ఇప్పటికే ఇది మొదలైన సంగతి తెలిసిందే...
  • ఈ విధంగా అన్ని వైపుల నుంచి, సెట్ చేశారు...
  • దీని కోసం మొదటిగా చేసేది, చంద్రబాబు పై కాకుండా, లోకేష్ పై ఎదో ఒక కేసులో ఇరికించటం....
  • చంద్రబాబు పై కేసు పెడితే, దేశంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలిసి, లోకేష్ ని టార్గెట్ చేసుకున్నారు... అందులో భాగంగానే, పవన్ పదే పదే లోకేష్ పై రెండు రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నారు...
  • ఎప్పుడు లేనిది, నేషనల్ మీడియాకు ఎక్కి, ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఎక్కువైంది అని, లోకేష్ అతి పెద్ద కరప్షన్ లీడర్ అంటూ చెప్పటం...
  • ముందుగా ఇలా సెట్ చేస్తున్నారు ఇలా చేసి, రాష్ట్రంలో అనిశ్చితి తీసుకువచ్చి, రాష్ట్ర ఇమేజ్ దెబ్బతియ్యటం....
  • ఆపరేషన్ గరుడ నెక్స్ట్ స్టెప్, ఏప్రిల్ చివరి వారంలో, మే మొదటి వారంలో పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహారదీక్ష...
  • తద్వారా అల్లర్లు సృష్టించడం...
  • విజయవాడ రంగా హత్య జరిగిన సమయంలో జరిగిన అల్లర్ల తరహాలో అల్లర్లు సృష్టించడం...
  • తద్వారా చంద్రబాబు పాలన వైఫల్యం వలనే ఇలా జరిగింది అని ప్రచారం చెయ్యడం...
  • మరో పక్క జగన్ చేత విమర్శలు చేపిస్తూ, ప్రభుత్వ వైఫల్యం పేరుతో వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాలు...
  • జగన్ పార్టీ రాజీనామాలు, పవన్ దీక్షకు స్పందనగా రాష్ట్రానికి మేలు చేసినట్టు బీజేపీ ఎన్నికల ముందు ప్రకటనలు చేస్తుంది...
  • ప్రత్యెక హోదా అంటూ, వివిధ విభజన హామీల పై ప్రకటనలు చేస్తారు...
  • దీంతో ఆపరేషన్ గరుడు సంపూర్ణం అవుతుంది...
  • ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో పవన్,వైకాపా కూటమి ఏర్పాటు చేసి, ఎన్నికలకు వెళ్లి, దక్షణాది రాష్ట్రాల్లో ఉనికిని చాటుకొనే దిశగా బీజేపీ ఆపరేషన్ గరుడా ప్రధానంగా సాగనుంది...
  • ఈ క్రమంలో, మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనే దాని పై, ఢిల్లీ కుట్రలను ఎలా తిప్పి కొడతారో,
  • చంద్రబాబు లాంటి నాయకుడుని ఎలా కాపాడుకుంటారో అనే దాని పై, ఈ ఆపరేషన్ రెజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది

Video Source: Maha News & Content Source: Amaravthi Voice

Posted On 19th March 2018