సైకిల్ ఎక్కిన YCP ఎమ్మెల్యే

సైకిల్ ఎక్కిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గురించి తెలియని వారుండరు. అయితే నారా లోకేష్ ఆయనపై పోటీ చేస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరింత పాపులారిటీ సంపాదించారు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి కుమారుడు పోటీ చేస్తున్న చోట ఏకపక్షంగా ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నారా లోకేష్ కి నువ్వా నేనా అన్నంత గట్టిపోటీ ఇస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో రెండు ఫోటోలు చక్కర్లు కొడుతోంది. అవేంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సామాన్యుడిలా సైకిల్ పై తిరగడం ఒకటైతే, ఒక షాప్ మెట్లపై కూర్చుని టిఫిన్ చేసేది రెండో ఫోటో. ఈ ఫోటోలపై నెటిజన్లు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి సింప్లిసిటీ సూపర్ అని, ఖచ్చితంగా గెలుస్తారని కొంతమంది స్పందించగా, మరికొంత మంది ఆయన టిడిపి లోకి వస్తారని అందుకే సింబాలిక్ గా సైకిల్ పైన వెళ్తున్నారని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఏదోఒక విధంగా వార్తల్లో నిలవడం ఆర్కే... అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ‌స్పెషాలిటీ.

Posted On 18th May 2019