దేశాన్నే కాపాడిన గుంటూరు పోలీస్

భారత దేశంలో నమోదు అవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువగా వినపడుతున్న ఢిల్లీ లోని తబ్లిగి జమాత్ శిక్షణ సదస్సు గురించిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే మొదటగా ఈ లింక్ ను కనుగొన్నది దాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది మాత్రం ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీస్ ఆఫీసర్, ప్రస్తుతం గుంటూరు అర్బన్ డిఐజీ గా పనిచేస్తున్న పిహెడి రామకృష్ణ.

ఎలా కనుగొన్నారంటే:

మార్చి 25 నా గుంటూరు కు చెందిన 52 ఏళ్ళ వ్యక్తికి కరోనా సోకింది. కానీ ఆ వ్యక్తి గానీ, కుటుంబ సభ్యులు గానీ ఎటువంటి విదేశీ ప్రయాణాలు చేయలేదు. అసలు ఆ వ్యక్తికి కరోనా ఎలా వచ్చింది అన్న విషయం మిస్టరీ గా మారింది.

సరిగ్గా అప్పుడే రామకృష్ణ రంగంలోకి దిగారు. ఆ కరోనా బాధితుడి సంబంధించిన ఫోన్ ఆధారంగా ఢిల్లీ సదస్సు కు సంబంధించిన సమాచారం రాబట్టారు. దాంతో ఆ ఢిల్లీ సదస్సు జరిగిన ప్రాంతంలో సెల్ ఫోన్ టవర్ల ఆధారంగా వేలమంది అక్కడ గుమిగూడారని నిర్ధారించుకున్నారు.

మూడురోజుల్లో జరిగిన ఢిల్లీ సదస్సు కు సంబంధించిన 13500 మంది సమాచారాన్ని గుంటూరు లో ఉండే సేకరించారు రామకృష్ణ.

ఇంక వెంటనే కేంద్ర ప్రభుత్వ ఇంటిలిజెన్స్ బ్యూరో కి సమాచారం అందించారు. దాంతో వెంటనే అలెర్ట్ అయిన కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమాచారం అందించింది. ఇంక ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలిసిందే.

ఈయనే కనుక చొరవ తీసుకుని ఉండకపోతే పరిస్థితి ఎలా ఉండేదో... హేట్సాఫ్ పిహెచ్ డి రామకృష్ణ

Posted On 10th April 2020